అందం, అభినయం రెండు ఉన్నప్పటికీ మాత్రం అదృష్టం కలిసి రాలేక స్టార్ హీరోయిన్ రేంజిలో సక్సెస్ కాలేక పోయింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.RX -100  సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్  కి బాగా సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే తన విలనిజమైన నటనతో ఆడియన్స్ ని బాగా అలరించింది. పాయల్ సినిమాలో ఉందంటే కచ్చితంగా బోల్డ్ పెర్ఫార్మషన్స్ ఎక్కువగానే ఉంటుందని తన మొదటి సినిమా నుంచి మెప్పిస్తూ ఉన్నది. అందుకే పాయల్ కు ఎక్కువగా అలాంటి అవకాశాలే వస్తూ ఉన్నాయి.


ఇక ఇండస్ట్రీలో ఎక్కువగా ఇలాంటి పాత్రలు చేస్తే అలాంటి పాత్రలకే పరిమితం అవుతారని కూడా తెలియజేసింది. రీసెంట్ గా ఈమె ట్విట్టర్లో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇండస్ట్రీలో కొనసాగించడం చాలా కఠినమైన పరిస్థితిగా మారిపోయిందనీ ప్రతిరోజు ఏదో ఒక తెలియని భయంతోనే మనం మొదలు పెడుతున్నాము ఇండస్ట్రీలో నెపోటిజమే ఎక్కువగా రాజ్యమేలుతున్నదంటూ తెలియజేసింది. నీ దగ్గర నిజమైన టాలెంట్ ఉంటే ఈ నెపోటిజం ముసుగులో కనుమరుగైపోతుంది అంటూ తెలిపింది.


నేను పడే ఈ కష్టానికి తగిన ఫలితం తన టాలెంట్ కి తగ్గ అవకాశాలు భవిష్యత్తులో అయినా వస్తాయో రావు అని భయం కూడా తనలో ఉందని ఎందుకంటే పెద్ద సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు నా చెయ్యి నుంచి జారిపోయి చాలా సార్లు వెళ్లాయి అంటూ తెలిపింది. ఇలాంటివి తలుచుకుంటే మనసుకు చాలా బాధగా ఉంటుందంటూ తెలియజేసింది పాయల్. మరి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సీక్వెల్లో నటించలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి తదుపరి చిత్రాలు ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: