తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త ఒరవడిని పరిచయం చేసిన హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ముందు స్థానంలో ఉంటారు. ఈయన సినిమా ఇండస్ట్రీకి కౌబాయ్ పాత్రాలను పరిచయం చేశారని చెప్పవచ్చు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గత కొన్ని సంవత్సరాల క్రింద మరణించారు. అయితే ఆయన మరణానికి కారణం మహేష్ బాబు అని వేణుస్వామి ఒక వేదికగా చెప్పారు. మరి మహేష్ బాబు తండ్రి మరణానికి ఎలా కారణమవుతాడు ఆ వివరాలు చూద్దాం.. 1995 నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో వేణుస్వామి పూజలు నిర్వహించే వారట. అయితే ఆయన జాతకాలు చూసేటప్పుడు ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్పేవారట. 

అప్పట్లో నేను వారి జాతకం చెబుతూ విజయ నిర్మల 2020 తర్వాత ఇంట్లో మరణాలు సంభవిస్తాయని చెప్పడంతో, వారి కుటుంబ సభ్యులు భయపడిపోయి నాతో జాతకం చెప్పించడం మానేశారు. కానీ నేను చెప్పినట్లుగానే 2020 తర్వాత మరణాలు సంభవించాయి. ఇదే తరుణంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే మహేష్ బాబు గ్రహస్థితి గురించి కూడా తెలియజేశాను. ఆయన సింహరాశి కావడంతో 2020 నుంచి గ్రహాల మార్పు ఆయన కుటుంబంపై ప్రభావం చూపింది.

 జనవరి 16 తర్వాత మహేష్ బాబు తల్లిదండ్రుల జీవితాల్లో ఏదో ఒక అనర్ధం జరుగుతుందని,  తాను గ్రహించానని ఆ ప్రభావం కృష్ణ గారి మృతిపై పడిందని  చెప్పకనే చెప్పాడు. అయితే ఈ విషయాన్ని నేను నా సొంతంగా చెప్పలేదని గ్రహాల ప్రభావం వారి జాతక చక్రాన్ని బట్టి చెప్పానని చెప్పుకొచ్చారు. ఈ విధంగా మహేష్ బాబు గ్రహస్థితి వల్లే తన తండ్రి మరణించాడని అనడంతో సూపర్ స్టార్ అభిమానులంతా వేణు స్వామిపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.నీ నోటి కి హద్దు అదుపు ఉండదా.. ఏది పడితే అది వాగుతూనే ఉంటావా.. నువ్వసలు మనిషివేనా..అంటూ వేణు స్వామి పై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: