కామెడీ హీరోలుగా ఇప్పటి జనరేషన్లో ఎంతో మంది హీరోలు పేరు తెచ్చుకుంటున్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుంది. అలాంటి వారిలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు.ఈయన తన విభిన్నమైన యాక్టింగ్ తో ఓ సినిమాలో విలన్ గా..ఓ సినిమాలో హీరోగా..కామెడీ హీరోగా..ఇలా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నవీన్ పోలిశెట్టి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు.ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారారు.ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక జాతరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ముఖ్యంగా జాతిరత్నాలు  సినిమాతో నవీన్ పోలిశెట్టి రేంజ్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు.అయితే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గా మొదట మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కే అవకాశం వచ్చిందట. కొద్ది శాతం షూటింగ్ కూడా జరిపాక డైరెక్టర్ ని తొలగించారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే..మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ శంకర్ పాల్గొనగా అందులో నవీన్ పోలిశెట్టితో మీకున్న గొడవ ఏంటి అనే ప్రశ్న ఎదురైంది.ఆ ప్రశ్నకు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. అనగనగా ఒక రాజు మూవీకి డైరెక్టర్గా మొదట నన్నే తీసుకున్నారు.కరోనా లాక్డౌన్ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం.ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకి కూడా సైన్ చేశారు. అలా ఆ సినిమా షూటింగ్లో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం ఆయనకి కుదరలేదు.దాంతో ఈ సినిమాని పక్కన పెట్టారు.

అయితే నేను కూడా చాలా రోజులు ఈ షూటింగ్ కి వస్తారని వెయిట్ చేసి వేరే సినిమా చేద్దామని వెళ్లాను. కానీ నేను తీసుకున్న నిర్ణయం నవీన్ పోలిశెట్టి కి నచ్చలేదు కావచ్చు. ఎందుకంటే అనగనగా ఒక రాజు సినిమా స్టోరీని తీసుకురా మనం వేరే డైరెక్టర్ ని తీసుకుందాం అని నాగవంశీ కి చెప్పారట. అలా నన్ను ఆ సినిమా నుండి తప్పించేసి వేరే డైరెక్టర్ ని పెట్టుకున్నారు అంటూ నవీన్ పొలిశెట్టితో ఉన్న గొడవ గురించి డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ చెప్పుకొచ్చారు. అలాగే అనగనగా ఒక రాజు మూవీలో మొదట హీరయిన్ గా శ్రీలీల ఫిక్స్ అయింది.కానీ ఆ హీరోయిన్ ని తీసేసి మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.అలా డైరెక్టర్ తో పాటు హీరోయిన్ ని కూడా చేంజ్ చేశారు. కేవలం హీరో డైరెక్టర్ మాత్రమే కాదు సినిమాకు సంబంధించిన మిగతా డిపార్ట్మెంట్ల వాళ్లు కూడా నవీన్ పోలిశెట్టి తీసుకున్న వారే పనిచేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: