తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా కానీ చిరంజీవి మేనరిజం మరోలా ఉంటుంది.. అలా అని చిరంజీవి ఏదో సినీ బ్యాగ్రౌండ్ నుంచి రాలేదు.. సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్కో మెట్టెక్కుతూ ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి  ప్రస్తుతం ఆరుపదుల వయసు దాటినా కానీ  కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈయన తాజాగా వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభరా సినిమాలో చేసిన విషయం అందరికీ తెలుసు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక ఈ మూవీ తర్వాత ది గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయబోతున్నారట.

 అయితే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను ఉగాది సందర్భంగా ప్రారంభించారు. ఇదే తరుణంలో చిరంజీవి తన కూతురు సుస్మితకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. అయితే తండ్రి సినిమాకు కూతురు నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభ సమయంలో అనిల్ రావిపూడి ఒక ఫన్నీ వీడియో క్రియేట్ చేశారు. సినిమాకు పని చేసే అన్ని డిపార్ట్మెంట్ల వారు  మెగాస్టార్ సినిమాలకు సంబంధించినటువంటి ఒక కటౌట్ పెట్టుకొని  ఆయన గురించి కాసేపు మాట్లాడి పరిచయం చేసుకోవాలి అన్నారు. దీనిలో భాగంగానే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వారు చిరంజీవి యొక్క శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా కటౌట్ పెట్టుకొని పరిచయం చేసుకున్నారు. 

ఇదే తరుణంలో చిరంజీవి అక్కడికి రాగానే సుస్మిత లేచి  నమస్తే సార్ నా పేరు సుస్మిత కొణిదెల. నేను మీ చిత్రానికి ప్రొడ్యూసర్ అంటూ పరిచయం చేసుకున్నారు. దీంతో చిరంజీవి మీ ఇంటి పేరు ఏంటమ్మా మరోసారి చెప్పు అంటూ సుస్మిత అని అడిగారు. ఆమె కొణిదెల అని చెప్పడంతో ఇంటి పేరుని చెడగొట్టొద్దు నిలబెట్టాలి ఆల్ ది బెస్ట్ అంటూ  వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: