మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ద్వారా చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంత గొప్ప విజయం సాధించిన సినిమా తర్వాత చరణ్ , చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా చరణ్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.

ఇక ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్లను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి. ఇకపోతే జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ఇప్పటి నుండే ఈ మూవీ కి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను టి సిరిస్ సంస్థ ఏకంగా 25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజుల సమయం ఉండగానే ఈ మూవీ కి మ్యూజిక్ హక్కుల ద్వారా భారీ ఎత్తున బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: