నాగబాబు కుమార్తె నిహారిక కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించింది. కానీ ఈమె నటించిన ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాలు సాధించలేదు. ఇక అలాంటి సమయంలోనే ఈమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈమె సినిమాల్లో దాదాపుగా నటించడానికి దూరంగా ఉంది. కొంత కాలం క్రితమే ఈమె విడాకులు తీసుకుంది. విడాకుల అనంతరం మాత్రం నిహారిక సినిమాల్లో నటించడం కంటే కూడా సినిమాలను నిర్మించడంలో అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ వెబ్ సిరీస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నిహారిక ఆ తర్వాత చాలా మంది కొత్త వాళ్ళతో కమిటీ కుర్రాళ్ళు అనే ఓ సినిమాను నిర్మించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో నిహారికకు నిర్మాతగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. కుర్రాళ్ళు లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత ఈమె సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో ఓ మూవీ చేయబోతుంది. ఈ సినిమాకు మనీషా శర్మ దర్శకత్వం వహించబోతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు నిహారిక , సంగీత్ శోభన్ , మనీషా శర్మ ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ , కమిటీ కుర్రాళ్ళు రెండు కూడా ప్రేక్షకాదరణ పొందడంతో నిహారిక నిర్మించే ఈ మూడవ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: