టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటించి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మహేష్ నటించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా మహేష్ నటించిన చాలా సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు "ఒక్కడు" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో భూమిక హీరోయిన్గా నటించగా ... గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2003 వ సంవత్సరం విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ కూడా దక్కాయి. ఇకపోతే ఈ మూవీ ని మరొక సారి ఈ మూవీ బృందం వారు రీ రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ బృందం వారు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను ఈ ఏప్రిల్ నెలలో మరోసారి రీ రిలీస్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ సారి రీ రిలీజ్ లో భాగంగా ఒక్కడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: