తాజాగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ మార్చి 28 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన మ్యాడ్ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. అద్భుతమైన విజయం సాధించిన మ్యాడ్ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో మొదటి నుండి కూడా మ్యాడ్ స్క్వేర్ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో ఈ సినిమా ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తూ అద్భుతమైన జోష్లో ముందుకు సాగుతోంది.

ఇకపోతే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ రావడం , అదే రేంజ్ లో కలెక్షన్లు కూడా వస్తూ ఉండటంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క సక్సెస్ ఈవెంట్ ను ఏప్రిల్ 4 వ తేదీ శిల్ప కళా వేదికలో నిర్వహించాలి అని ఈ మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు , అలాగే ఈ సినిమా యొక్క సక్సెస్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ చీఫ్ గెస్ట్ గా రావడానికి అంగీకరించినట్లు సమాచారం.

ఇక ఈ రోజు ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో ఇంకా కొంత కాలం పాటు ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: