ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీలోని అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక పుష్ప పార్ట్ 2 లో కూడా అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప లాంటి అద్భుతమైన విజయం తర్వాత బన్నీ తన తదుపరి మూవీ ని తమిళ దర్శకుడు అయినటువంటి అట్లీతో చేయబోతున్నాడు.

ఇప్పటికే వీరి కాంబోలో మూవీ సెట్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీ , అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. బన్నీ మూవీ కోసం అట్లీ ఒక హీరోయిన్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ , ప్రియాంక చోప్రాను అనుకుంటున్నట్లు , ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు , అన్ని ఓకే అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే గతంలో రామ్ చరణ్ "జంజీర్" అనే సినిమాలో హీరోగా నటించిన ఆ విషయం మనకు తెలిసిందే.

ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి ఇప్పటికే తెలుగు హీరో సినిమాలో నటించి అపజయాన్ని అందుకున్న ప్రియాంక చోప్రా , అల్లు అర్జున్ మూవీ లో హీరోయిన్గా సెలెక్ట్ అయితే ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: