మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల , రవితేజకు జోడిగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తుంది అని రవితేజ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఇక అలాంటి సమయం లోనే మాస్ జాతర మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు విడుదల చేయడం లేదు అని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయబోతున్నాం అని మేకర్స్ ప్రకటించారు.

దానితో సంక్రాంతి మిస్ అయినా పర్లేదు సమ్మర్ లో సినిమా వస్తుంది అని రవితేజ అభిమానులు ఖుషి అయ్యారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పూర్తి అయిన కూడా మే 9 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి కావడం కష్టం అని , దానితో ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , మరికొన్ని రోజుల్లో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఒక వేళ ఈ సినిమా మే 9 వ తేదీన కూడా విడుదల కావడం లేదు అని అధికారిక ప్రకటన వచ్చినట్లయితే రవితేజ అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి మాస్ జాతర సినిమాను ఏ తేదీన విడుదల చేస్తారు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt