
అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతుంది . రీసెంట్ గా ఈ సినిమాలోని టెక్నీషియన్స్ అండ్ టీం ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు అనిల్ రావిపూడి . ఈ వీడియో చాలా చాలా హైలెట్ గా మారింది. అయితే ఈ మూవీలో పదే పదే ఒక పదాన్ని నొక్కి నొక్కి చెప్పారు. ఆ కారణంగా ఇప్పుడు ఆ పదం బాగా ట్రెండ్ అవుతుంది. బహుశా వీళ్లిద్దరు కాంబోలో రాబోయే సినిమాకి అదే టైటిల్ ఏమో అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదే అంటూ టాక్ వినిపిస్తుంది .
చిరంజీవి ఫేమస్ డైలాగ్ "రఫాడిద్దాం" అంటూ అనిల్ రావిపూడి లో ఢిఫరెంట్ యాంగిల్స్ లో చెప్పారు. లో అండ్ హై యాంగిల్ లో కుసింత గట్టిగానే ట్రెండ్ చేసారు. బహుశా ఈ సినిమాకి ఆ "రప్ఫాడిద్దాం" అనే టైటిల్ ని పెట్టబోతున్నారేమో అంటున్నారు జనాలు . కొంతమంది మాత్రం "చిరునవ్వుల పండగ"అనే టైటిల్ ని ఓకే చేసినట్లు మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా వైరల్ గా మారింది. చూద్దాం మరి ఏ టైటిల్ ఫైనలైజ్ చేస్తాడో అనిల్ రావిపూడి..!??