
మరి కొంతమంది మాత్రం అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల చూస్సింగ్ విషయంలో .. నెక్స్ట్ సినిమాల షెడ్యూల్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనేది బిగ్ హాట్ టాపిక్ గా బిగ్ కన్ఫ్యూషన్ గా మారిపోయింది. సోషల్ మీడియా ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ను పక్కన పెట్టేసి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ని సెట్స్ పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు బన్నీ అంటూ ఓ టాక్ వినిపించింది .
అన్ని సక్రమంగా జరిగి ఉంటే ..ఉగాది కి ఈ సినిమా అఫిషియల్ అప్డేట్ వచ్చేది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఫైనల్ డెసిషన్ బన్నీ తీసుకోలేదట . సినిమా కాన్సెప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అంటూ అట్లీకి చెప్పారట. కానీ అట్లీ దానిపై ఎటువంటి ఫైనల్ అప్డేట్ ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ ఇప్పుడు ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టే విధంగా ఆలోచిస్తున్నారట . అంతేకాదు ఈలోపే సంజయ్ లీల భన్సాలీ నుంచి పిలుపు రావడంతో ఆయన డైరెక్షన్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారట . ఈ సినిమా మల్టీ స్టారర్ . అల్లు అర్జున్ హీరోగా కాదు విలన్ షేడ్స్ లో నటించబోతున్నాడు . కచ్చితంగా ఫ్యాన్స్ ఒప్పుకోరు . మరి అల్లు అర్జున్ ఎందుకు ఈ సినిమాను చూస్ చేసుకుంటున్నాడు ..? అసలు అల్లు అర్జున్ లైఫ్ లో ఏం జరుగుతుంది ..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది . సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన డౌట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ టీం కానీ సినిమా అప్డేట్ పై స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!