దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి మ్యాడ్ అనే సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా మ్యాడ్ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ థియేటర్లలో భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తుంది. దానితో ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కూడా కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను కూడా అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

5 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 10.18 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.95 కోట్లు , ఉత్తరాంధ్ర లో 2.78 కోట్లు , ఈస్ట్ లో 1.79 కోట్లు , వెస్ట్ లో 89 లక్షలు , గుంటూరు లో 1.61 కోట్లు , కృష్ణ లో 1.30 కోట్లు , నెల్లూరు లో 74 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 5 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22.24 కోట్ల షేర్ ... 36.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 5 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.65 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 5.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 5 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 29.19 కోట్ల షేర్ ... 51.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 22 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 7.19 కోట్ల లాభాలను కూడా అందుకని హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: