
ఈ విషయం చాలామంది స్టార్స్ బయటపెట్టారు . అయితే ప్రభాస్ లో మరొక తెలియని యాంగిల్ కూడా ఉంది . ప్రభాస్ ఎవరినైనా ఇష్టపడితే వాళ్లకోసం ఎలాంటి శాక్రిఫైజ్ అయినా చేస్తాడు . మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రభాస్ తీసుకున్న డెసిషన్ ఆయన ఫ్యాన్స్ తల ఎత్తుకునేలా చేసింది . ప్రభాస్ కి రాజమౌళి అంటే ఎంత ఇష్టం అన్న విషయం అందరికీ తెలుసు . ప్రభాస్ రాజమౌళి కాంబో అంటే ఎవర్ గ్రీన్ హిట్ కాంబో అనే చెప్పాలి . వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్టే.
అయితే బాహుబలి సినిమా తర్వాత వీళ్ళ కాంబోలో సినిమా కోసం జనాలు బాగా వెయిట్ చేశారు. ఒకానోక ఇంటర్వ్యూలో రాజమౌళిని ప్రభాస్ డైరెక్ట్ గా అడిగేశాడు. "ఏం డార్లిం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నన్ను గెస్ట్ రోల్ లో తీసుకోకూడదా..? అని"..ఆ మాటలను బాగా సీరియస్ గా తీసుకున్నాడు ఏమో జక్కన్న..ఇప్పుడు రాజమౌళి నిజంగానే ప్రభాస్ ని గెస్ట్ పాత్రలో చూపించబోతున్నాడట, అది కూడా స్టార్ హీరో మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాలో. ఎస్ ఎస్ ఎం బి 29 సినిమాలో మహేష్ బాబు హీరోగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో కొంతమంది హీరోస్ ని హీరోయిన్స్ ని చూపించబోతున్నాడట రాజమౌళి . అందులో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది . ఈ సినిమా సెకండ్ షెడ్యూల్లో ప్రభాస్ గెస్ట్ పాత్రలో వచ్చే సీన్స్ ని షూట్ చేయబోతున్నారట. సోషల్ మీడియా ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!