
ఈ మధ్యకాలంలో అనిల్ రావిపూడి తెరకెక్కించే ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆయన పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఆయన సినిమా తెరకెక్కిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాగా ఇప్పుడు అనిల్ రావిపూడి - న్చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తయిపోయాయి . పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు అనే విషయం చాలా చాలా వైరల్ గా మారింది .
రకరకాల హీరోయిన్స్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాలో ఇలియానాను తీసుకోబోతున్నట్లు టాక్ బయటకి వచ్చింది . అనిల్ రావిపూడి కొత్త బ్యూటీస్ ని తీసుకోకుండా పాత హీరోయిన్స్ తోనే కొత్త పద్ధతిని చూపిస్తూ ఉంటాడు . ఐశ్వర్య రాజేష్ - తమన్నా లాంటి హీరోయిన్స్ ని ఎలా చూపించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు చిరంజీవి సినిమాల్లో ఇలియానాను స్పెషల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారట . ఈ క్యారెక్టర్ సినిమా కి హైలెట్ గా ఉండబోతుందట. అయితే గతంలో రామ్ చరణ్ కు ఇలియానాకు పెళ్లి చేయాలి అనుకున్నాడు చిరంజీవి అంటూ సోషల్ మీడియాలో తెగ రూమర్లు ట్రెండ్ అయ్యాయి. అది నిజమో కాదు తెలియదు కానీ అప్పుడు ఇంటికి కోడలుగా చేయాలి అనుకున్న ఇలియానాతో ఇప్పుడు చిరంజీవి రొమాన్స్ అంటూ జనాలు చీప్ గా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!