టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నితిన్ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం నితిన్ "మాచర్ల నియోజకవర్గం" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఫ్లాప్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి కూడా భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు భారీ అపజయాలను అందుకున్న నితిన్ తాజాగా రాబిన్ హుడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో నితిన్ కచ్చితంగా విజయాన్ని అందుకుంటాడు అని చాలా మంది భావించారు. ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు కూడా భారీ నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర యావరేజ్ కలెక్షన్లను కూడా అందుకోలేక పోతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ కూడా నితిన్ కెరియర్ లో భారీ ఫ్లాప్ గా మిగిలి అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.


5 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.14 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 68 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.13 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.95 కోట్ల షేర్ ... 9.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 5 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 37 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 76 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 6.08 కోట్ల షేర్ ... 12 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 27.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 28.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా మరో 22.42 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: