
దీంతో అప్పటి నుంచి విశ్వంభర సినిమా పైన కూడా పెద్దగా అంచనాలు ఏర్పడలేకపోయాయి. కానీ ఇందులో హీరోయిన్స్ గా త్రిష ,మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ వంటి వారు నటిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతికి విశ్వంభర చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే డైరెక్టర్ అనిల్ రావుపూడితో కూడా తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టారు చిరంజీవి. విశ్వంభర సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా కొంతమేరకు ఆలస్యం అవుతుందని టాక్ కూడా వినిపిస్తోంది.
సినిమాలోని విజువల్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయని ఫ్యాన్స్ సంథింగ్ స్పెషల్ ట్రీట్ అన్నట్లుగా ఉండవచ్చని మెగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. కానీ ఇందులో చిరంజీవి లుక్ మాత్రం అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసేలా కనిపించింది. మరి చిరంజీవి బర్త్డే లేదా మరొక డేట్ లో ఈ సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదికి ఉన్నప్పటికీ కూడా కొంతమేరకు అసంతృప్తి కూడా కనిపిస్తున్నది. కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. మరి ఏమి ఎరకు ఎలాంటి రికార్డులను రాస్తుందో చూడాలి.