
ప్రతి ఈవెంట్ లోను మీరు ఇంటికి ఎంత సేఫ్గా వెళ్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని .. ఇక్కడికి రావడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపించారో.. ఎంత సేఫ్ గా వచ్చారో.. ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు అంతే ఇంట్రెస్టింగ్గా అంతే సేఫ్ గా వెళ్లాలి మీకోసం మీ ఇంట్లో అమ్మానాన్న వెయిట్ చేస్తూ ఉంటారు జాగ్రత్త జాగ్రత్త అంటూ చెబుతూనే ఉంటాడు. ఫ్యాన్స్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే కేర్ వేరే లెవెల్ అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ హీరో గానే కాదు స్పెషల్ క్యారెక్టర్ లో కూడా మెరవడానికి ఓకే చేస్తూ ఉంటాడు. కానీ ఖచ్చితంగా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి.. లేకపోతే జనాలకు ఉపయోగపడాలి ..అలాంటి రోల్స్ నే చేస్తాడు.
గతంలో చింతకాయల రవి సినిమాల్లో ఐదు సెకండ్ లు అలా మెరిసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ పాత్రలో కనిపించనే లేదు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సినిమాలో మాత్రం గెస్ట్ పాత్రలో కనిపించడానికి ఛాన్స్ వచ్చింది . కానీ జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు . ఆ సినిమా మరేంటో కాదు మిస్టర్ పర్ఫెక్ట్ . ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా .. తాప్సి మరొక హీరోయిన్గా నటించిన సినిమా. ఈ సినిమాల్లో క్లైమాక్స్ సన్నివేశంలో జూనియర్ ఎన్టీఆర్ ని ప్రభాస్ ఫ్రెండ్ గా దింపుతూ క్లైమాక్స్ వేరే విధంగా రాసుకున్నారట డైరెక్టర్ . కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ పాత్ర చేయడానికి ఇష్టపడలేదట . తన పాత్ర అంత కన్వీన్సింగ్గా లేదు అని ఏదో యాడ్ చేసినట్లు ఉంది అని చెప్పి సినిమాను రిజెక్ట్ చేసారట . ఒకవేళ ఆరోజు జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకొని ఉంటే ఆ సీన్స్ తో అలాగే తెరకెక్కించి ఉండేవాడేమో డైరెక్టర్ .. అయినా సరే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది .