నాచురల్ సార్ట్‌ నాని హీరో గా ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ది ప్యారడైజ్ కూడా ఒకటి .. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టైటిల్ గ్లింస్ తో భారీ అంచనాలు అయితే పెంచేసింది ఈ సినిమా .. అయితే ఇప్పుడు ఈ సినిమా పై  పలు షాకింగ్ పుకార్లు వినిపించడం మొదలయ్యాయి .. అయితే ఈ సినిమా ఆగిపోతుంద ని బడ్జెట్ లేదు అంటూ పలు రూమర్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్న క్రమంలో .. మేకర్స్ నుంచి ఊహించని ఘాటు రిప్లై బయటికి వచ్చింది .. తమ సినిమా పై ఇలా వార్తలు చేస్తున్న జోకర్స్ అందరికీ ఇదే మా సమాధానం తమ సినిమా తోనే వారందరి కీ గట్టి సమాధానం చెబుతామని వారు అంటున్నారు ..


అలాగే సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్న వారందరి కీ కూడా సమయం దగ్గర్లోనే ఉంది అన్నట్టు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు .. ఇక తమ సినిమా టాలీవుడ్ లోనే ఒక గ్రేటెస్ట్ సినిమా గా మిగిలిపోతుంది అన్ని విభాగాల్లో టెక్నీషియన్స్ ప్రాణం బట్టి పనిచేస్తున్నారు. మేము గొప్ప సినిమా చేస్తున్నామంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామ ని కూడా క్లారిటీ ఇచ్చారు .. ఇక ఇది మాత్రం ది ప్యారడైజ్ విషయం లో ఊహించని క్రేజీ మూవ్‌ గా మారిందని కూడా చెప్పవచ్చు .  ఇప్పటికే నాని బాక్సాఫీస్ దగ్గర వరస విజయాల తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ..  ఇప్పటికే మే 1 న హిట్ 3 తో బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతున్న‌డు .  అలాగే 2026 మార్చ్ 26న ది ప్యారడైజ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .  ఇక మరి ఈ సినిమా తో నాని శ్రీకాంత్ ఓదెల ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: