ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న‌.. సెన్సేషనల్ ద‌ర్శ‌కుడు కుమార్ కాంబినేషన్లో వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పా 2 ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ సినిమా కి కొనసాగింపు పుష్పా 3 ర్యాంపేజ్ కూడా ఉందన్న విషయం కూడా అందరికీ తెలుసు .. ఇప్పటికే పార్ట్-3 కి  లీడ్ గా పుష్ప 2 క్లైమాక్స్ లో కొత్త విలన్ ని మేకర్స్ పరిచయం చేయడం తో ఎవరు అనే సస్పెన్స్ అందరి కీ అలా మిగిలిపోయింది .. అయితే ఇప్పుడు అది ఎవరూ అనే ప్రశ్నకి దర్శకుడు సుకుమార్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది .. ఒక తమిళ ఈవెంట్ లో సుకుమార్ పాల్గొన్నారు అయితే ఆ పాత్ర లో విజయ్ దేవరకొండ , నాని అంటూ చాలా మంది అంటున్నారని మాటకి దానికి సమాధానం 2024 టైం సుకుమార్ కు తెలియదు ..


కానీ 2026 కి అలా స్క్రిప్ట్ రాసుకునే సుకుమార్ కి తెలుస్తుంది అంటూ ఊహించని ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు .. అంటే ఆ పాత్ర లో కనిపించేది ఎవరు అనేది ఇప్పటికీ ఎవరిని ఫిక్స్ చేయలేదని చెప్పాలి మరి అది ఎవరో అనేది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి . ఇక‌ మరి పుష్ప సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి కమిట్ అవుతున్నాడు .  ప్రస్తుతం రామ్ చరణ్ , బుచ్చిబాబు తో సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా రాబోతుంది . అలాగే ఈ సినిమా తర్వాత పుష్పా 3 వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది .. లేదంటే మరింత టైం తీసుకుంటారా అనేది సుకుమార్ కే తెలియాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: