
ఇక త్వరలోనే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు . ఇదే క్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంభోల్ లో వచ్చిన దేవర ఇండియాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే .. ఇక ఇప్పుడు రీసెంట్ గా జపాన్ లో కూడా ఈ సినిమా రిలీజ్ ఐ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది .. అలాగే అక్కడ సినిమా రిలీజ్ కి ముందు ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేసిన ఎన్టీఆర్ తన అభిమానులకు తన లేటెస్ట్ లుక్స్ తో మాత్రం మంచి కిక్ అందిస్తున్నాడని చెప్పాలి .
ఇక అక్కడికి వెళ్లిన నాటి నుంచి ఎంతో స్టైలిష్ ఫోటో షూట్ చేస్తూ తన నుంచి వస్తున్న ఫోటోలు కొన్ని అభిమానుల కి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి .. అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా మరికొన్ని స్టైలిష్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి . బ్లాక్ నెక్ టీ షర్ట్ మరియు బ్లాక్ పాంట్ లో పైన తెల్లటి డెనిమ్ షర్ట్ లో మంచి డ్యాపర్ గా కూల్ లుక్స్ లో కనిపిస్తూ ఎన్టీఆర్ అదరగొడుతున్నాడని చెప్పాలి .. ఇక దీంతో ఈ ఫోటోలు నందమూరి అభిమానులు వైరల్ చేస్తున్నారు .. ఇప్పుడు ఎన్టీఆర్ తన తర్వాత సినిమాల తో కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి .