
ఇక తను మాట్లాడుతున్న లేదా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ పెడుతున్న టిల్లునే కనిపించడం స్పష్టంగా గమనించుకోవచ్చు .. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తన నుంచి జాక్ సినిమా రాబోతుంది .. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది .. అయితే భాస్కర్ కి ఒక సపరేట్ మార్క్ ఉంది . తన సినిమాల్లో హీరో క్యారెక్టర్జేషన్ కూడా ఎంతో బాగుంటుంది .. ఇక ఇప్పుడుసిద్దు జొన్నలగడ్డ కూడా టిల్లులా కనిపించకుండా జాక్ పాత్ర ని చేయాలి .. సినిమా చూస్తున్నంత సేపు టిల్లు గుర్తుకు రానివ్వకుండా ఉండాలి అలా నటించాలి .
ఇక ఇది నటుడుగా సిద్దు కి అతిపెద్ద పరీక్ష . మరి ఇప్పుడు ఈ పరీక్షని సిద్దు ఎలా దాటుతా డో ఏప్రిల్ 10 న తెలుస్తుంది . అని అనుకున్నట్టు సిద్దు ఈ సినిమాతో విజయం సాధిస్తే మాత్రం .. టాలీవుడ్ కు మరో గ్రేటెస్ట్ హీరో దొరికినట్టే . ఇప్పటికే సిద్దు తన నటనతో ప్రేక్షకులను , దర్శికులను మెప్పించాడు . ఇప్పుడు జాక్ సినిమాతో మరో బ్లాక్బస్టర్ విజయం సాధిస్తే .. సిద్దు రేంజ్ మరో లెవల్ కి వెళుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . ఇక మరి సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమా తో ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి .