సినీ స్టార్స్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు.  అసలు మన ఫేవరెట్ హీరో ఏం చదువుకున్నాడు..?  ఏం అవ్వాలనుకున్నాడు ..? ఏ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చాడు..?  ఒకవేళ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఏమయ్యేవాడు ..? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మరీ మరీ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు బాగా హాట్ టాపిక్ గా మారు మ్రోగిపోతుంది. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్. అంతేకాదు అల్లు అర్జున్ పేరుకి ఉన్న  ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పాలి.


పుష్ప 2 తర్వాత ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత స్థాయిలో పెరిగిపోయింది.  ప్రజెంట్ అల్లు అర్జున్ .. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కానీ దానిపై అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు . కాగా అల్లు అర్జున్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . అల్లు అర్జున్ ఒకవేళ హీరోగా ఇండస్ట్రీ లోకి రాకపోయి ఉంటే ఏం చేసే లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకున్నాడు అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది .



అల్లు అర్జున్ మొదటి నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అంటూ ఫిక్స్ అయిపోయాడట.  అందుకే చదువుపై కూడా పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడట . అల్లు అర్జున్ మొదటి నుంచి చాలా చాలా చిల్ అవుట్ అవుతూ ఉండే టైప్.  చాలా జోవియల్ గా ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ ఉంటాడట . అల్లు అర్జున్ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ కాకపోయి ఉంటే మాత్రం కచ్చితంగా డాన్స్ కి సంబంధించిన ఒక స్కూల్ లాంటిది పెట్టి ఆయనకి డాన్స్ పై ఉండే ప్యాషన్ ని అలా తీర్చుకొని ఉండేవాడట . అల్లు అర్జున్ డ్యాన్స్ ఎంత  బాగా వేస్తాడు అనేది ప్రత్యేకంగా చెప్పాలా ..? మన తెలుగు ఇండస్ట్రీలో బాగా డ్యాన్స్ చేసే హీరోలు ఉండేది నలుగురు - ఐదుగురు వాళ్ళల్లో టాప్ స్థానంలో ఉంటాడు అల్లు అర్జున్ . ఆ విషయంలో నో డౌట్..!

మరింత సమాచారం తెలుసుకోండి: