చాలా సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ "ఆర్య 2" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా 2009 వ సంవత్సరం విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమాకు బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇప్పటికి కూడా ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయినట్లయితే మంచి టి ఆర్ పి రేటింగ్ ను సంపాదించుకుంటుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయి ఆ తర్వాత మాత్రం ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సినిమాను ఏప్రిల్ 5 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన అనేక తెలుగు సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ టికెట్ బుకింగ్స్ లను ఓపెన్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ టికెట్ బుకింగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల లోపే 25 కే ప్లస్ టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతమైన రీతిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా సరికొత్త రికార్డును సృష్టించే అవకాశాలు కూడా ఉన్నాయి అని అనేక మంది భావిస్తున్నారు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఆర్య 2 మూవీ ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ రికార్డులను నెలకొల్పుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa