కమీడియన్ గా కెరియర్ను మొదలు పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోగా కూడా అవకాశాలను దక్కించుకొని హీరోగా కూడా మంచి విజయాలను అందుకుంటూ కెరియర్ను అద్భుతమైన జోష్లో కెరీర్ నిట్ ముందుకు సాగిస్తున్న నటులలో ఒకరు అయినటువంటి ప్రియదర్శి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ప్రియదర్శి తాజాగా కోర్టు అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మార్చి 14 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 19 రోజుల బాక్సా ఫీస్ రన్ ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయింది. 19 రోజులైనా ఈ సినిమా కొత్త సినిమాలకు పోటీగా కలెక్షన్లను రాబడుతుంది. మరి ఈ 19 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 19 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 11.20 కోట్ల కనెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.95 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 8.20 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 19 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.35 కోట్ల షేర్ ... 37.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే 19 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2.43 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ఓవర్సీస్ లో 5.07 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 19 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 28.85 కోట్ల షేర్ ... 55.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ఈ సినిమా దాదాపు 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. 19 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 21.85 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: