టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ శంకర్ ఒకరు. ఈయన నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కొంత కాలం పాటు ఆగిపోవడంతో కళ్యాణ్ శంకర్ "మ్యాడ్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మ్యాడ్ మూవీ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. కళ్యాణ్ శంకర్ ఆ తర్వాత మ్యాడ్ స్క్వేర్ మూవీ ని రూపొందించాడు. ఆ మూవీ కూడా కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే తాజాగా కళ్యాణ్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన నవీన్ పోలిశెట్టితో సినిమా ఆగిపోవడానికి గల కారణాలను , అలాగే అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ ... నేను అనగనగా ఒక రాజు సినిమా కథను నవీన్ పోలిశెట్టికి చెప్పాను. అది ఆయనకు బాగా నచ్చింది. కానీ ఆయన కొన్ని మార్పులు , చేర్పులు అడిగాడు. ఆ తర్వాత ఈ కథను నాగ వంశీ గారికి వినిపించాను. ఆయనకు కూడా కథ బాగా నచ్చింది.

అంతా సెట్ అయ్యింది ... కానీ నవీన్ అప్పటికే వేరే మూవీకి కమిట్ అయి ఉండడంతో రెండు సినిమాలు ఒకే సారి చేయలేకపోయాడు. ఆ లోపు నేను మ్యాడ్ మూవీ ని చేశాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అనగనగా ఒక రాజు కథతో నవీన్ వేరే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు అని చెప్పాడు. అలాగే అనగనగా ఒక రాజు సినిమా కథ విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా సలహాలు ఇచ్చారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని కళ్యాణ్ శంకర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: