
అల్లు అర్జున్ అంటే స్నేహ రెడ్డికి విపరీతమైన ఇష్టం ప్రేమ . ఆ విషయం అందరికీ తెలుసు. కాగా అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు .. అసలు అల్లు అర్జున్ కి ఇక సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంటుందా ..? ఆయన కెరియర్ మళ్ళీ పుంజుకుంటుందా..? అని చాలా చాలా టెన్షన్ పడి బాధపడిపోయిందట . కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ పేరు నెంబర్ వన్ స్థానంలో ఉంది . అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపైన హీరోగా బాగా ట్రెండ్ అవుతున్నాడు.
ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . పాన్ ఇండియా స్టార్స్ కూడా ఉన్నారు. కానీ ఏ ఇండస్ట్రీకి వెళ్లి మొదటగా వినిపించే పేరు హీరో అల్లు అర్జున్. బన్నీ అంటే పుష్ప2 సినిమా చేశాడే ఆ హీరోనేనా..? ఆ అల్లు అర్జున్ నేనా..? అంటూ మాట్లాడుకుంటున్నారు . ఇది చాలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి . కలెక్షన్స్..పాత రికార్డ్స్ బద్దలు కొట్టిన కొట్టకపోయినా అభిమానుల మనసులను మాత్రం కొల్లగొట్టాడు . అంతకంటే ఏం కావాలి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సైతం అల్లు అర్జున్ లైఫ్ ఎలా ఉండాలి అనుకున్నిందో.. అల్లు అర్జున్ పేరు ఎంత టాప్ పొజిషన్లో ఉండాలి అనుకున్నిందో.. అదే విధంగా ఉంది . ఇప్పుడు అందరూ ఆల్ హ్యాపీస్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను ప్రకటిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!