తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎన్నో మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ "సారంగపాణి జాతకం" అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో ప్రియదర్శి హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి ఇంద్రగంటి మోహనకృష్ణ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సారంగపాణి జాతకం మూవీ ఈవెంట్ లో భాగంగా ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ... సారంగపాణి జాతకం మూవీ లో సారంగపాణి పాత్రను ప్రియదర్శి తప్ప మరెవ్వరూ చేయలేరు. ఎవరు చేసిన అది అంత గొప్పగా ఉండదు. సినిమా చూశాక చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట అంటారు అని ఇంద్రగంటి మోహనకృష్ణ తాజాగా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ప్రియదర్శి ఈ మధ్య కాలంలో హీరో గా నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన మల్లేశం , బలగం , కోర్టు మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇలా ప్రియదర్శి హీరోగా రూపొందిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో తాజాగా ప్రియదర్శి హీరోగా రూపొందిన సారంగపాణి జాతకం సినిమాపై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి సారంగపాణి జాతకం మూవీ తో ప్రియదర్శి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: