తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరుపొందిన సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం జాక్.. ఇందులో మరొక యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఏప్రిల్ 10 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ తో వేగవంతంగా దూసుకుపోతున్నారు. ట్రైలర్ ను కూడా ఇటీవలే కొన్ని నిమిషాల క్రితం విడుదల చేయగా మరింత ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.


గతంలో విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్ సైతం ప్రేక్షకులను  బాగా ఆకట్టుకున్నది. తాజా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేయగా.. టైలర్ విషయానికి వస్తే.. నార్త్, ఈస్ట్ , వెస్ట్, సౌత్.. ఫోర్ సిటీస్, 436 వీరందరికీ లీడర్స్  రెహమాన్ అనే ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ ఎంట్రీ కూడా ఇందులో జాక్ పాత్రలో చూపించారు. అలాగే వీకే నరేష్ ఇందులో సిద్దు జొన్నలగడ్డ తండ్రి పాత్రలో నటించారు. తన కామెడీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనేల కనిపిస్తున్నారు.



అలాగే హీరోయిన్ వైష్ణవి చైతన్యతో సిద్దు జొన్నలగడ్డ రొమాన్స్ కూడా ట్రైలర్లో హైలైట్ గా కనిపిస్తోంది. లిప్ లాక్ సన్నివేశాలు కూడా ట్రైలర్ లో హైలైట్ గా కనిపిస్తూ ఉన్నాయి.. సిద్దు జొన్నలగడ్డ కూడా మరింత ఆకట్టుకున్నలా కనిపిస్తూ ఉండడమే కాకుండా పలు రకాల విభిన్నమైన పాత్రలలో కూడా కనిపించబోతున్నారు. మరి సిద్దు జొన్నలగడ్డ కూడా ఇందులో ద్విపాత్రాభినయంలో నటించారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.. ఒకవైపు పోలీసులకు సపోర్టు చేస్తూనే మరొకవైపు దొంగగా చూపించారు. చూస్తూ ఉంటే ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ సక్సెస్ అయ్యేలా ఉన్నారు. మరి బొమ్మరిల్లు భాస్కర్ కూడా సినిమాతో కం బ్యాక్ ఇస్తారేమో చూడాలి మరి. మరి ఏం జరుగుతుందో ఏప్రిల్ 10వ తేదీన తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: