ప్రజెంట్  ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . జూనియర్ ఎన్టీఆర్ నాగచైతన్య సినిమాకు సపోర్ట్ చేయబోతున్నాడు . నాగచైతన్య సినిమా కోసం తన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి మనిషి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . జూనియర్ ఎన్టీఆర్ చాలా మంది స్టార్స్ కు సపోర్ట్ చేశారు. మరీ ముఖ్యంగా యంగ్ హీరోస్ ను ఆయన బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు . మాస్ కా దాస్ విశ్వక్సేన్ కు ఎలా హెల్ప్ చేశాడు అన్న విషయం అందరికీ తెలుసు.


అయితే ఇప్పుడు నాగచైతన్యకు జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేయబోతున్నారట.  నాగచైతన్య.. విరూపాక్ష డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు . ఈ సినిమా కోసం తన స్పెషల్ వాయిస్ ను ఇవ్వబోతున్నాడట జూనియర్ ఎన్టీఆర్ . జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఈ సినిమాకి హైలైట్ గా మారిపోతుంది అంటున్నారు మేకర్స్.  జూనియర్ ఎన్టీఆర్ సాధారణంగా ఒక సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇష్టపడడు.  కానీ ఈ సినిమా కథ కాన్సెప్ట్ బాగా ఆకట్టుకునిందట . ఆ కారణంగానే రిస్క్ అయినా సరే తన వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట .



జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నా ఈ నిర్ణయం ఇప్పుడు ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది.  గతంలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ "ఛావా" సినిమాకు డబ్బింగ్ చెప్పబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ వార్తలు వినిపించాయి. కానీ అది జరగలేదు. ఇప్పుడు నాగచైతన్య సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అన్న విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి నాగచైతన్య కెరియర్ ఈ సినిమా ఎలా మలుపు తిప్పుతుందో..?  రీసెంట్ గానే తండేల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు . నాగచైతన్య ఇప్పుడు మరొకసారి తనలోని టాలెంట్ చూపించి ఈ సినిమాని  కూడా హిట్ గా మలుచుకుంటే మాత్రం ఇక నాగ చైతన్య ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్లు అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: