2013 లో వచ్చిన పోటుగాడు సినిమా అప్పటి వాళ్లు అందరూ చూసే ఉంటారు. మంచు మనోజ్ హీరోగా చేసిన ఈ సినిమాలో సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్, అనుప్రియ గోయెంక వంటి హీరోయిన్లు నటించారు.అయితే ఈ సినిమాలో నటించిన అనుప్రియ గోయెంక తాజాగా సంచలన కామెంట్లు చేసింది.ఓ నటుడితో కిస్ సీన్స్ చేస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఈ హీరోయిన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది హీరోయిన్లు తమకి సినిమాలు చేసే సమయంలో ఎదురుపడ్డ ఎన్నో చేదు అనుభవాలను బయటపెడుతూ ఉంటారు. అలా అనుప్రియా గోయెంక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఆమె మాట్లాడుతూ.. నేను ఓ సినిమాలో నటుడుతో లిప్ కిస్ చేయడానికి రెడీ అయ్యాను.ఆ టైంలో నేను వేసుకున్న డ్రెస్ కూడా నాకు అంత కంఫర్ట్ గా లేదు.ఇక షూటింగ్ ఓకే అయ్యి షాట్ ఓకే స్టార్ట్ అనడంతోనే ఆ నటుడు నా నడుము దగ్గర క్యాజువల్ గా చేయి  వేసి పట్టుకోవాలి. కానీ ఆ నటుడు మాత్రం నా నడుము దగ్గర కాకుండా వేరే ప్లేస్ లో చేయి వేశాడు.అయితే మీరు ఎందుకు అక్కడ చేయి వేశారు అని నేను అడగొచ్చు.కానీ ఆ నటుడు ఏదో కంగారులో వేశాను సారీ అనుకోకుండా తగిలింది అని చెప్పి వెళ్ళిపోతాడు అంతే. కానీ ఆ తర్వాత చేసే సన్నివేశంలో మాత్రం ఇలా ప్రవర్తించకండి అని మాత్రమే చెప్పాను.

ఆరోజు ఆ నటుడు చేసిన పనికి నేను చాలా బాధపడ్డాను అంటూ అనుప్రియ గోయెంక తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. అయితే ఆ నటుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.కానీ అనుప్రియా గోయెంక మాటలను బట్టి ఆమె సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే టెలివిజన్ సిరీస్ లో చేసిన నటుడు గురించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఇక బాలీవుడ్ నటి అయినటువంటి అనుప్రియ గోయెంక హిందీ సినిమాలులోనే కాకుండా పలు వెబ్ సిరీస్లు అలాగే తెలుగులో మంచు మనోజ్ తో పోటుగాడు తో పాటు పాఠశాల మూవీలో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: