అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటే అంటే ఇదే అనుకోవాలి .. పాయల్ రాజ్‌పుత్ కు ఏదో అయింది ఆమెకు రావాల్సిన అవకాశాలను మరెవరో ఎగరేసుకుపోయారు .. ఇక దీంతో ఈమె హట్‌ అయింది వెంటనే ట్విట్టర్ ఓపెన్ చేసి ఆవేశంగా రెండు భారీ పోస్టులు పెట్టేసింది .. ఇండస్ట్రీ లో కొనసాగడం ఎంతో కఠినమైన విషయంగా మారిపోయింది.. ప్రతిరోజు ఏదో తెలియని భయం తో మొదలవుతుంద ని పడే కష్టాని కి తగిన ఫలితం టాలెంట్ కు తగ్గ అవకాశాలు రావేమో అనే భయం వెంటాడుతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టింది .. అలాగే అక్కడి తో ఆగితే మరోలా ఉండేది .. ఇండస్ట్రీ లో నెపోటిజం రాజ్యమేలుతుంది , నిజమైన టాలెంట్ ఈ నెపోటిజం వల్ల కనిపించకుండా పోతుంద ని తన ఆవేదన ను బయటపెట్టింది .. అయితే ఇక్కడే పాయల్‌పై అసలైన కామెంట్స్ మొదలయ్యాయి ..
 

హీరోల విషయం లో నెపోటిజం అంటే ఓకే .. హీరోయిన్ల కు కూడా నెపోటిజం ఎక్కడ ఉంటుంద ని చాలామంది ఆమె ను ఘాటుగా ప్రశ్నిస్తున్నారు .. సరైన కథలు , బ్యానర్లు ఎంచుకోక కెరీర్ ను నాశనం చేసుకుని ఇప్పుడు ఇలా నెపోటీజం మంటూ బీద కేకలు అరుపులు అరుస్తున్నారంటూ మరికొందరు ఆమె పై విమర్శలు చేస్తున్నారు .. ఆర్ఎక్స్ 100 లాంటి సినిమా తో ఏ హీరోయిన్ కు దొరకనంత మంచి లాంచింగ్ పాయల్ కు దొరికిందని , కానీ ఆ తర్వాత చెత్త స్క్రిప్టులు సినిమాలు ఎంచుకొని ఆమె క్రెజ్‌ ఆమె నాశనం చేసుకుంద ని మరికొందరు ఆమె ప్రవర్తన చూసి బాధపడ్డారు .. అయితే కెరీర్‌ మొదట్లోనే పాయల్ కు హాట్ ఇమేజ్ వచ్చేసింద ని , ఇక దాంతో ఫ్యామిలీ ప్రేక్షకుల కు ఆమె దూరమైంద ని మరికొందరు అభిప్రాయపడ్డారు .. ఇలా మొత్తాని కి సింపతి కోసం పాయల్ పోస్ట్ పడితే అది ఆమెకే రివర్స్ గా తయారైంది .

మరింత సమాచారం తెలుసుకోండి: