- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఇక దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు విమానాశ్రయం లో పోలీసుల కు దొరుకుపోయి జైలు జీవితం అనుభవిస్తున్న నటి రన్యారావు నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ నాయిస్థానంలో అర్జీ వేసేందుకు ఆమె భర్త జతిన్ హుక్కురి సిద్ధమయ్యారు .. ఒక పెళ్లిళ్లు బ్రోకర్ ద్వారా 2024 అక్టోబర్ 6 న ఒక రెస్టారెంట్ లో వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు .. అదే నెల 23 న వీరి నిశ్చితార్థ్యం జరిగింది.. బెంగళూరులోని ఒక స్టార్ హోటల్ లో 2024 నవంబర్ 27 న వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది .. అలాగే ఒక ఖరీదై న ఫ్లాట్ లో వీరి దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టారు .. అలా కలిసి ఉంటున్న నెల రోజుల కే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి ..


భర్త వద్దన్నా పని ఉందని వ్యాపారం చేసుకోవాల ని ప్రతిసారి ఆమె దుబాయ్ కి వెళ్లి వచ్చేదని .. వద్దన్నా విన‌కుండా ఆమె విదేశీ ప్రయాణాలు చేయడం తో ఆమె నుంచి జతిన్ దూరంగా ఉంటూ వచ్చారు .  అయితే మార్చ్ 2 వ‌ తేదీ అర్ధరాత్రి రన్యా రావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రెవెన్యూ ఇంటిలిజెంట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఆమె అరెస్ట్ తర్వాత , ఆమెన్ తరుణ్ అక్రమ వ్యాపారం బయటకు వచ్చింది .. ఇక ఇప్పుడు ఈ కేసులో  జతిన్ ను డిఆర్ఐ అధికారులు విచారించారు .. అలాగే బంగారం స్మగ్లింగ్లో ఆయన ప్రమేయం ఏది లేదని తేలక కేసు నుంచి బయటకు వచ్చాక ఆమె తో కలిసి ఉండటం ఇక సాధ్యం కాదని భావించి ఓ ప్రముఖ న్యాయవాది ప్ర‌భులింగ నావడ‌గి సాయంతో విడాకులకు అర్జీని రెడీ చేసుకుంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: