హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి అనుకొని ఉన్న 400 ఎకరాలపై ఇప్పుడు జోరుగా ఊహించిన వివాదం కొనసాగుతుంది .   తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి అంటుంది విద్యార్థులు ప్రకృతి నాశనం అంటున్నారు .. మధ్యలో హీరోయిన్లు కూడా ఈ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నారు .. ఇప్పటికే సమంత , రేణు దేశాయ్ , ఇషా రెబ్బా లాంటి చాలామంది ఈ ఇష్యు పై తమ స్పందన వినిపిస్తున్నారు . అలానే వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు .. అయితే వీరు ఎటువైపు మగ్గు చూపారు ఎవరికీ మద్దతు ఇచ్చారని విషయాన్ని పక్కనపెడితే .. అసలు ఈ వివాదం పై హీరోలు ఎందుకు స్పందించడం లేదు అనేది అంతు చిక్కని ప్రశ్న ..


ఇప్పటికే సమంత , రేణు దేశాయ్  లాంటి హీరోయిన్లు అంతా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నారని వాళ్లకు అర్బన్ ఫారెస్ట్ గురించి బాగా తెలుసు అని కొందరు అంటున్నారు .. అయితే ఇదే సమయంలో నాగచైతన్య , రామ్ చరణ్ , ప్రభాస్ , రానా లాంటి హీరోలు కూడా ఇదే ప్రాంతంలో ఉంటున్నారు కదా .. వీళ్లకు కూడా దీనిపై ఎంతో కొంత అవగాహన ఉంది మరి వాళ్ళు ఎందుకు ఈ విషయం పై స్పందించడం లేదు అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది ?  అయితే ఇక్కడ ఒక విషయంపై స్పందించాల వద్ద అనేది అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఇష్టం ..


అయితే కాకపోతే కొంతమంది రియాక్ట్ అయి మరి కొంత మంది సైలెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాదనలు వస్తూ ఉంటాయి .. సెంట్రల్ యూనివర్సిటీ రగడపై కూడా ఈ చర్చ మొదలు అవడానికి కూడా ఇదే కారణం .. ఇప్పటివరకు ఒక హీరో కూడా దీనిపై స్పందించకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయమే . ఇక ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని గాడిన పెట్టారనే ప్రచారం కూడా మరోపక్క నడుస్తుంది .. అయితే ఇప్పుడు ఈ వివాదం పై స్పందిస్తే మొత్తానికి మోసం వస్తుందని చిత్ర పరిశ్రమ ఏమైనా భయపడుతున్నందా అనేది కూడా తెలియాల్సి ఉంది ..?

మరింత సమాచారం తెలుసుకోండి: