బింబి సారా సినిమా తో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు .  అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన ఆమిగోస్ , డెవిల్ సినిమాలు మాత్రం భారీగా నిరాశపరిచాయి .. అయితే ఇప్పుడు ఆయన నుంచి‘అర్జున్ సన్నాఫ్ వైజ‌యంతీ’ సినిమా రాబోతుంది.  విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్న సినిమా ఇది .. ప్రదీప్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెర్కక్కించాడు .. టీజర్ ఇటీవల విడుదలైంది దానికి మంచి స్పందన కూడా వచ్చింది .. సినిమా కూడా ఇప్పటికే పూర్తయింది ..


మే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .  అయితే ఇప్పుడు కళ్యాణ్‌రామ్ కాస్త తొందర పడుతున్నారు .. ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట .. అంటే మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది . ఇలా ఈ 15 రోజుల్లో కావాల్సినంత ప్రమోషన్ చేయగలరా సినిమాని ప్రేక్షకల్లోకి తీసుకెళ్లగలరా ? అనేది మాత్రం పెద్ద డౌట్ .. అయితే ఈ మధ్య ప్రమోషన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు నిర్మాతలు .. కనీసం నెలరోజుల ముందు నుంచే సినిమా ప్రమోషన్ల హడావుడి మొదలు పెడుతున్నారు . అలాంటిది ఇప్పుడు 15 రోజులు గ్యాప్ అనేది చాలా తక్కువ .. ఇటీవల ట్రైలర్ కట్‌ కూడా చూశారు .  


ఈ ట్రైలర్ చూసిన వాళ్లంతా ఎంతో సంతృప్తి వ్య‌క్తం చేశారు .. కచ్చితంగా ప్రేక్షకుల్ని థియేటర్లకు ర‌ప్పించే విధంగా ట్రైలర్ ఉందని చిత్రబంధం బలంగా నమ్ముతుంది .. ఇక ఈ రెండు వారాల్లో గట్టిగా ప్రమోషన్లు చేసుకుంటే ఓపెనింగ్ కి ఎలాంటి కొరత ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇక మరోవైపు కళ్యాణ్ రామ్ ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టేసారు .. ఈ సినిమాని జనంలోకి తీసుకువెళ్లడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికే ఓ పాట రిలీజ్ అయింది .. మిగిలినవన్నీ వరుసగా తీసుకురాబోతున్నారు .  రిలీజ్ డేట్ పై అధికార ప్రకటన రావటమే మిగిలి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: