- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఈ ప్రస్తుత కాలంలో మన తెలుగు సినిమాల డ్యాన్సులు కూడా కొంత వివాదాస్పదమౌతున్న విషయం తెలిసిందే .. మిస్టర్ బచ్చన్ నుంచి మొదలు పడితే డాకు మహారాజ్ , రాబిన్ హూడ్ వర‌కు ఇలా చాలా సినిమాల్లో డాన్సుల కొరియోగ్రఫీ కాంట్రవర్సీ అవుతూనే వస్తుంది .. అయితే డాన్సులు కూడా వివాదాస్పదం చేయటం పై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు .. స్టెప్పుల పై గోల ఎప్పట్నుంచో ఉందని ఆయన చెప్పకు వచ్చాడు .. ఇక ఈ స్టెప్పుల పై గోల ఎప్పటి నుంచో ఉంది ఏది చేసినా అది కొందరి కి నచ్చదు కొందరి కి నచ్చుతుంది .. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇది ఉంది .. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఎక్కువ గా కనిపిస్తుంది .  ప్రతి ఒక్కరి కి నోరు ఉంటుంది .


 ఆ నోటి కి ఒక ఒపీనియన్ ఉంటుంది .. ఇలాంటి వాటి లో కూడా నైతిక అనైతిక అని ఆలోచిస్తే .  ఇక ఎవడు బయట తిరగలేడు .. ఏది చేసినా ఇష్టపడే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారని .. వ్యతిరేకించే వాళ్ళు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తార ని .. అలా నచ్చిన వాళ్ళు టికెట్ కొనుక్కుని సినిమా కు వెళ్తారని ఆర్జీవి అంటున్నాడు .. అయితే వీరి లో ఎవరిది కరెక్ట్ అని ఎలా చెబుతామ ని కూడా ప్రశ్నిస్తున్నాడు .. నచ్చటం నచ్చకపోవటం అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఎప్పుడూ జరుగుతూ నే ఉంటుంది .. అయితే ఇప్పుడు సినిమాల డాన్సులు పై కూడా ఇలాంటి రాద్దాంతం చేయడం ఆపేయాలని ఆర్జీవి అంటున్నాడు .  అయితే ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యల పై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV