కన్నడ చిత్ర పరిశ్రమ దగ్గర నుంచి వ‌చ్చిన‌ పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అయ్యిన   పలు సినిమాల్లో గత కొన్నేళ్ల క్రితం వచ్చిన సెన్సేషనల్ డివోషనల్ హిట్ చిత్రం కాంతార కూడా ఒకటి .. కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరో గా తన సొంత దర్శకత్వం లో తెర్కక్కించిన ఈ భారీ హీట్ సినిమా కి ఫ్రీక్వల్ ని ఎనౌన్ చేసి భారీ హంగుల తో తెరకెక్కిస్తున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుండ గా ఈ సినిమా రిలీజ్ పై ఇప్ప‌టికే పలు పుకార్లు  అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి ..


సినిమా ని మేకర్స్‌ ఈ అక్టోబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడాని కి రెడీ చేస్తున్న విషయం తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ డేట్ లో సినిమా రాదు అని కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి . అయితే ఇప్పుడు ఈ రూమర్స్ కు మేకర్స్ దీని కి చెక్ కు పెట్టారు .. సినిమా అనుకున్నట్టే ఆన్ టైం కి వచ్చి తీరుతుంద ని కన్ఫర్మ్ చేశారు . దీంతో ఈ అవైటెడ్  ప్రీక్వెల్ సినిమా పై  క్లారిటీ వచ్చినట్ట నే చెప్పాలి .. ఇక ఈ సినిమా కి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండ గా హోంబళే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .  ఇక మరి ఈ సినిమా తో రైశ్శబ్ శెట్టి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు చూడాలి .


కాంతార క‌థ ఎక్క‌డి నుంచి మొద‌లైందో అక్క‌డ నూంచి వెన‌క్కి వెళ్లి.. కాంతార‌ బ్యాక్ స్టోరీ ని ఇందులో చూపించ‌బోతున్నారు. కాంతార లో హైలైట్ గా ఉన్న‌ డివైన్ ఎలిమెంట్స్‌ను కాంతార‌ చాప్టర్ 1 లో మ‌రింత ఎలివేట్ చేసి చూపించ‌నున్నారు. ఇందులో న‌టించే న‌టులు కూడా భారీగానే ఉండ‌బోతున్న‌రు . అయితే ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు వార్త‌లు రాగా.. వాటిని ఆయ‌న ఖండించారు. ఐదారు భార‌తీయ భాష‌ల్లో కాంతార‌ ప్రీక్వెల్ ఒకేసారి విడుద‌ల కానుంది. ఈసినిమాకి రూ.500 కోట్ల మేర బిజినెస్ అవుతుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: