
అలాగే అటు ఇటుక కనీసం 20 కోట్లు అయినా ఈ సినిమాతో నష్టపోయినట్టు తెలుస్తుంది .. అయితే మైత్రి వరకు 20 కోట్ల నష్టమంటే అంత పెద్దది కాదు .. పెద్ద సినిమాలు మధ్య రొటేషన్ లో ఈ సినిమా తాలూకు నష్టాలు పెద్దగా ఎఫెక్ట్ చేయకపోవచ్చు కానీ .. మైత్రి మూవీస్ మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం కాస్త తగ్గించే అవకాశం ఉంది.. ఎందుకంటే మైత్రి ఈ మధ్య అన్ని పెద్ద సినిమాలే చేస్తుంది .. అయితే ప్రజెంట్ మీడియం చిన్న సైజు సినిమాలపై ఈ సంస్థ తన దృష్టి పెట్టే ప్రయత్నాలు చేస్తుంది . అలాగే మీడియం రేంజ్ హీరోల తోనూ పలు సినిమాలను ఓకే చేయాలని మైత్రి ఆలోచన .. అయితే ఇప్పుడు అలాంటి ఐడియాలకు ఇలాంటి ఫలితాలు కొంత చెక్ పెడుతూ ఉంటాయి .
రాబిన్ హుడ్ ఓటీటీల వల్ల సగం రికవరీ అయింది .. అది కూడా మైత్రి లాంటి బ్యానర్ ఉండటం వల్లే అదే వేరే బ్యానర్ అయితే ఈ మాత్రం కూడా రికవరీలు వెనక్కి వచ్చేవి కావు .. ఇక ఈ ప్లాప్ మైత్రిని ఎఫెక్ట్ చేయటం పక్కన పెడితే హీరోగా నితిన్ దర్శకుడిగా వెంకిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి .. నితిన్ కు ఈ మధ్య వరుస ఫ్లాపులు తగులుతున్నాయి .. రాబిన్ హూడ్ తో అంత హిట్ కొడతారని అనుకున్నారు .. అలాగే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు కూడా . కానీ ఫలితం రాలేదు .. ఇక ఈ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టేసి పెద్ద హీరోల దృష్టిలో పడదాం అనుకున్నాడు వెంకి . ఇక ఇప్పుడు తన ప్రయాణం మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలి . మళ్లీ హిట్ కొడితే కానీ పెద్ద హీరోల దృష్టిలోకి వెళ్లడు .