
వాస్తవానికి యూత్లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలో అయిన దుల్కర్ సల్మాన్.. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ కూడా అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అప్పటిలో ఇప్పటి లుక్కుని కంపేర్ చేస్తూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే కొంతమందిని మాత్రం అందంగా కనిపించడం కోసం దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది. గతంలో కూడా ప్రముఖ డాక్టర్ మిధున్ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.
చాలా మంది హీరోలే కాకుండా, హీరోయిన్స్ ని కూడా కొన్ని సందర్భాలలో తమని మరింత అందంగా కనిపించడం కోసం సర్జరీలు కూడా చేయించుకున్న వారు ఉన్నారు ఈ విషయాలను కొన్ని సందర్భాలలో తెలియజేసిన మరి కొంతమంది సర్జరీల వల్ల అంద విహీనంగా కూడా మారిన వారు ఉన్నారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత మరిన్ని వరుస అవకాశాలు అందుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా రెండు చిత్రాలు నటిస్తున్నట్లు సమాచారం. మమ్ముట్టి కూడా విభిన్నమైన కథలతో అభిమానులను మెప్పిస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తండ్రి కొడుకులు ఒకే సినిమాలో కనిపిస్తారేమో చూడాలి.