తమిళ చిత్ర పరిశ్రమ లో దళపతి విజయ్ ఓ సునామి .. అక్కడ ఆయనది సూపర్ స్టార్డం .. విజయ్ నుంచి సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ ఊహించని విధంగా మారిపోతుంది .  ఏ సినిమాకు నాన్ దియేట్రికల్ వ్యాపారమైన అవ్వకపోయినా విజయ్ సినిమా అంటే ఎగబడు మరి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కొనేస్తూ ఉంటారు .. ఓటిటి మార్కెట్ ఇప్పుడు ప్రతిచోట డల్ గానే ఉంది .. కానీ విజయ్ సినిమా ‘జ‌న‌ నాయ‌గ‌న్’  మాత్రం హార్ట్ కేకుల అమ్ముడైపోతుంది .. ఈ సినిమాని అమెజాన్ సంస్థ దాదాపు 120 కోట్లకు కొనుగోలు చేసింది .


అంతేకాకుండా శాటిలైట్ రూపంలో మరో 55 కోట్లు ఈ సినిమాకు వచ్చాయి . ఇలా రిలీజ్ కు ముందే దాదాపు 175 కోట్ల బిజినెస్ చేసుకుంది .. ప్రజెంట్ కోలీవుడ్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది .. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు .  ఎన్నికలకు ముందు తాను చేసే చివరి సినిమా ఇదే .. అందుకే ఈ సినిమాకు ఇంత హైప్‌ వచ్చింది .. పైగా దర్శకుడు వినోద్ పై గట్టి భరోసా ఉంది . ఇక విజయ్ గత చిత్రం గోట్ దారుణంగా ప్లాప్‌ అయింది .  అయితే ఆ ఎఫెక్ట్స్ ఈ సినిమాపై ఏమాత్రం లేదు .. విజయ్ రెమ్యూనిరేషన్ కూడా దాదాపు 150 కోట్లకు పైనే ఉంది .. ఇక ఆ మొత్తాన్ని ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో నిర్మాతలు దక్కించుకున్నారు .. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది .  


బాబీ డియోల్  విలన్ గా కనిపించబోతున్నాడు .. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు .  2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది  .  సంక్రాంతి సీజన్ లో త‌మిళ‌నాట విజ‌య్‌కు పెద్ద పోటీ ఉండకపోవచ్చు కానీ తెలుగులో మాత్రం విజయ్ కు ఇది కష్టమే .  ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సీజన్ టార్గెట్గా చేసుకొని చాలా సినిమాలు ఈ యుద్ధంలోకి రాబోతున్నాయి .. అందులో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఉంది .  అయితే ఇప్పుడు ఈ పోటీలో విజయ్ సినిమా నిలబడుతుందో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: