కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాగ వంశీ నిర్మాతగా చేసిన మ్యాడ్ 2 మూవీ మార్చి 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు 75 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా అడుగులు వేస్తోంది.నార్నె నితిన్, సంతోష్ శోభన్, రామ్ నితిన్,విష్ణు లు కీలక పాత్రల్లో నటించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ చూడడానికి యూత్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే..మ్యాడ్ స్క్వేర్ మూవీ మొత్తం లడ్డు గాడి పాత్ర చుట్టే తిరుగుతుంది. లడ్డు గాడి పాత్రలో విష్ణు అనే నటుడు నటించారు. 

అయితే ఈ లడ్డు గాడి పాత్రలో నటించిన విష్ణు ఆ స్టార్ హీరో కి చాలా దగ్గర సన్నిహితుడట. ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.. మరి విజయ్ దేవరకొండ కి లడ్డు గాడి పాత్రలో నటించిన విష్ణు కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ కి విష్ణు సబ్ జూనియర్ అంట.. విజయ్ దేవరకొండ కాలేజీ రోజుల్లో ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా విష్ణు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారట. అలా వీరి మధ్య బాండింగ్ ఉందట. ఇక టాక్సీవాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా బయట పెట్టారు.మేం కాలేజీ రోజుల్లో ఉన్న సమయంలో విష్ణు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఎక్కువగా ఆలోచించేవాడు. అప్పటికే మంచి టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ విష్ణ. అలాగే అందరినీ నవ్వించేవాడు. అందుకే నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు.

అలా నేను సినిమాల్లోకి వచ్చాక విష్ణుని నా సినిమాలో తీసుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య బాండింగ్ పెరుక్కుంటూ వస్తోంది అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన టాక్సీవాలా మూవీలో విష్ణు హాలీవుడ్ అనే రోల్ లో నటించారు. అయితే అప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో లడ్డు గాడి పాత్రలో నటించిన విష్ణు మన విజయ్ దేవరకొండ కి దగ్గరే అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక విష్ణు ఫోటోగ్రాఫర్ అలాగే వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా పాపులర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: