
అలా సౌత్ ఇండస్ట్రీలోను కనుమరుగవుతున్న పూజ హెగ్డే ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలలో నటించేలా ప్లాన్ చేసుకుంది. కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన సూర్య నటిస్తున్న రెట్రో చిత్రంలో కూడా నటిస్తోంది.అలాగే రజనీకాంత్ నటిస్తున్న కూలి చిత్రంలో కూడా ఒక స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటికి తోడుగా రాఘవ లారెన్స్ నటించిన కాంచన 4 చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్న పూజ హెగ్డే కు సరైన సక్సెస్ అందుకోలేకపోతోంది.
దీంతో పూజ హెగ్డే తన కెరీర్ కోసం కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న ఈ రోజున తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్వామి దర్శించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ అమ్మవారి సేవలో పాల్గొని మరి తన ముక్కులను చెల్లించినట్లు అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అక్కడ వేద పండితుల ద్వారా శేష వస్త్రంతో సత్కరించుకొని మరి వారి యొక్క ఆశీర్వాదాలను కూడా తీసుకున్నది పూజా హెగ్డే. మరి తన సినిమాలు సక్సెస్ కావాలని ఇలా పూజలు చేయించుకున్న పూజా హెగ్డే కెరియర్ ఏ విధంగా మలుపు తిరుగుతోందా చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.