
ఇకపోతే, సల్మాన్ నటించిన గత చిత్రాలు కూడా పరాజయం అందుకోవడంతో అభిమానులందరూ ‘సికందర్’పై గట్టి నమ్మకాలే పెట్టుకున్నారు. ఈ సినిమా అయినా తమ హీరోకు బ్లాక్ బస్టర్ ఇస్తుందని, బాలీవుడ్లో అలజడి రేపుతోంది భావించారు. కానీ అంతా తలకిందులైంది. సినిమా విడుదలయ్యాక అభిమానులకి నిరాశే ఎదురైంది. కథ, కథనం, దర్శకత్వం పేలవంగా ఉండడంతో సినీ విశ్లేషకులు పెద్ద ఎత్తున సినిమాపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వారు ఎక్స్ వేదికగా సాజిద్‌ను తిడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో నిర్మాత సతీమణి వార్దాఖాన్ స్పందిస్తూ.. అభిమానుల పోస్టులను రీపోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా, వారిని తిడుతూ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ‘విమర్శలను ఈ విధంగా రీపోస్ట్ చేస్తున్నందుకు మీకు ఏమాత్రం సిగ్గు అనిపించడం లేదా?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అనంతరం ఆమె ఆయా కామెంట్స్‌ను డిలీట్ చేశారు.
బీటౌన్‌లోని స్టార్ నిర్మాతల్లో సాజిద్ నదియావాలా ఒకరినే విషయం అందరికీ తెలిసిందే. అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్, టైగర్ ష్రాఫ్ వంటి హీరోల చిత్రాలను ఎక్కువగా నిర్మించిన ఘనత ఆయనదే. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా ‘జుడ్వా’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘కిక్’ చిత్రాలను నిర్మించింది ఆయనే. తాజాగా ‘సికందర్’ చిత్రం చేయగా సదరు సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సల్మాన్‌కు జంటగా రష్మిక నటించారు. కాజల్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు.