
టాలీవుడ్ లో హీరోలు . దర్శకుల మధ్య అనేక విషయాల్లో సహజంగానే గొడవలు వస్తూ ఉంటాయి. క్రియేటివ్ డిఫరెన్స్ స్ అనో లేదా నాకు కథ ఒకలా చెప్పి .. దర్శకుడు సినిమా మరోలా తీస్తున్నాడని హీరో అభ్యంతరం పెట్టడమో లేదా .. హీరో ఓవర్ ఇన్వాల్ మెంట్ భరించ లేక పోతున్నా అని దర్శకుడు అనడమో ఇలాంటి గొడవలే సహజంగా హీరో, దర్శకుడి మధ్య జరుగుతూ ఉంటాయి. ఇక యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ పై గతంలో కొన్ని ఈ తరహా ఆరోపణలే వచ్చాయి. సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో సిద్ధు నటించాల్సిన ఓ సినిమా నుంచి కూడా సిద్ధు తప్పుకుని మరీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ విషయం అప్పట్లో పెద్ద రాద్దాంతం అయ్యింది. ఇక ఇదిలా ఉంటే
సిద్దు జొన్నలగడ్డ – బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరూ కలిసి ‘ జాక్ ’ అనే సినిమా చేశారు. ఈనెల 10న రిలీజ్ అవుతోంది.
ఈ సినిమా షూటింగ్ టైంలో ఈ ఇద్దరి మధ్య గొడవలు నడిచాయని .. కమ్యూనికేషన్ గ్యాప్ బాగా వచ్చేసిందని రూమర్లు బయటకు వచ్చాయి. హీరో సిద్దు క్రియేటీవ్ వర్క్స్ లో బాగా ఇన్‌వాల్వ్ అవుతున్నాడని, అది భాస్కర్‌కు నచ్చడం లేదని బాగా ప్రచారం జరిగింది. ఇక సిద్ధు అయితే ఓ పాట ను భాస్కర్ లేకుండానే షూట్ చేశారని రకరకాల వార్తలు వచ్చాయి. వీటిపై అటు సిద్దు, ఇటు భాస్కర్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా చాలా మంది మదిలో ఆ అనుమానాలు అలాగే ఉండిపోయాయి. ఇక దీనిపై భాస్కర్ మాట్లాడుతూ సినిమా టీం వర్క్.. అదో వార్ జోన్‌లా ఉంటుంది.. ఆ రూమ్‌లో కొట్టుకుంటాం.. తిట్టుకుంటాం ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాక అందరం అవన్నీ మర్చిపోతాం అని చెప్పారు. ఓ సీన్‌ను నమ్మి సిద్ధు చేతిలో పెట్టేయవచ్చు.. మానిటర్ ముందు కూర్చొని యాక్షన్ .. కట్ చెపితే చాలని సిద్ధును భాస్కరే వెనకేసుకు వచ్చారు.
ఇక సిద్దు కూడా తమ మధ్య గొడవలే లేవని క్లారిటీ ఇచ్చారు. ఓ పాట తాను షూట్ చేసినా.. దర్శకుడు భాస్కర్‌కు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా షూట్ ఎలా చేస్తామని సిద్దు జొన్నలగడ్డ కౌంటర్ ఇచ్చాడు. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు.. హ్యాపీగా ఉన్నారు. దీంతో వీరి మధ్య గొడవలు లేవని క్లారిటీ వచ్చింది.