
టాలీవుడ్ సీనియర్ హీరో .. మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా ఇటీవలే మొదలైంది. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతోన్న క్రేజీ అనిల్ రావిపూడి దర్శకుడు. 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే టార్గెట్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నారు. ఇక చిరంజీవి ఫోకస్ అంతా కూడా ఈ సినిమాపైనే వుంది. అయితే ఈ హడావుడిలో చిరు నటిస్తోన్న ‘ విశ్వంభర ’ని ఎవరూ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి 2025 సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ వాళ్లు ఏకంగా రు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ తర్వాత దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరు నటిస్తోన్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కావడం విశేషం.
ఇక సంక్రాంతికి వస్తుందనుకున్న సినిమా సమ్మర్ అన్నారు.. ఇప్పుడు సమ్మర్ నుంచి వాయిదా వేశారు. ఆగస్టు 22న విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చిత్రబృందం స్పష్టత ఇవ్వడం లేదు. టీజర్ వచ్చి చాలా రోజులు అయ్యింది. టీజర్ వచ్చాక సినిమా పై అప్పటి వరకు ఉన్న హైప్ కాస్త తగ్గిపోయింది. మధ్యలో చాలా పండగలు వచ్చి వెళుతున్నా విశ్వంభర సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. చివరకు ఓటీటీ డీల్ కూడా నిర్మాతలు అనుకున్న రేటు రాకపోవడంతో ఈ సినిమా ను రిలీజ్ చేయలేక.. వాయిదా వేయలేక ఇబ్బందులు పడుతున్నారట. ఓటీటీ దృష్టిని ఆకర్షించడానికైనా ఓ మంచి పాట విడుదల చేస్తారని అనుకుంటే అది కూడా జరగడం లేదు. ఏదేమైనా విశ్వంరభ సినిమా విషయంలో చివరకు చిరు కు కూడా ఆశలు పోయాయని టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ టాక్ ?