టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటన అందచందాలతో సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నటి రాశి కన్నా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ సినిమాలో తన అమాయకమైన నటన, అందం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీ తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఈ చిన్నది తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగింది.


ఎంతోమంది స్టార్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఈ మధ్యకాలంలో రాశి కన్నా తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోంది. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిన్నది హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అంతే కాకుండా తమిళంలోనూ కొన్ని సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ చిన్నది ఒకప్పుడు ఎంతో లావుగా, బొద్దుగా ఉండేది కానీ ఇప్పుడు సన్నజాజి తీగల మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోనూ షేర్ చేసుకుంది. ఆ వీడియోలో రాశి కన్నా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉంది. 


చాలా సన్నగా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో రాశి కన్నాను చూసిన చాలా మంది అభిమానులు చాలా హాట్ గా అందంగా ఉన్నావు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో మీరు లావుగా ఉన్నప్పుడే చాలా అందంగా ఉండే వారిని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ రాశి కన్నా ఇలా పూర్తిగా మారిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం రాశి కన్నా హాట్ గా చాలా అందంగా క్యూట్ గా కనిపిస్తోంది. అయితే రాశి కన్నా సినిమాలలో అవకాశాల కోసమే ఇలా పూర్తిగా మారిపోయిందేమో అని కొంతమంది అంటున్నారు. ఈ వార్తలపై రాశి కన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: