
అందుకు ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి అంటు తెలిపారు.. అధికారం లేనప్పుడు అసలు ప్రజా సమస్యల గురించే మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఎన్నికలలో గెలిచారో వాటిని పక్కన పెట్టేశారు ఏపీలో నిరుద్యోగం ఎంత ఉంది తెలుసా? ఎక్కడ చూసినా కూడా లంచాలే కనిపిస్తూ ఉన్నాయి. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి చాలా చోట్ల రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారంటే ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
వీటన్నిటిని పరిష్కరించకుండానే తను కాన్సెప్ట్ మార్చేసేలా చేశారని అలా ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించారు. సినిమాలలో లాగా రకరకాల దుస్తులు మార్చేసి మాట్లాడటం ఇది అసలు సినిమా కాదు అని అతను ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అని చెప్పారు. ఇక అలాగే తిరుమల లడ్డు వివాదం పైన మాట్లాడుతూ తాను సనాతన ధర్మానికి వ్యతిరేకిని కాదు.. కానీ సున్నితమైన అంశాలను కూడా రాజకీయం చేయడం వల్ల చాలా మంది భక్తుల మనోభావాలను దెబ్బతిన్నలా చేశాయి. తిరుపతి లడ్డు వ్యవహారం పైన అంటూ తెలిపారు. అలాంటి వ్యవహారాలలో మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఆధారాలతో చూపించి మాట్లాడాలి నోటికొచ్చినట్లు మాట్లాడడం సరైనది కాదు అంటూ తెలిపారు.