అక్కినేని కోడలు నటి శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శోభిత ధూళిపాళ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి సినిమాల మీద ఉన్న ఆసక్తితో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది వరుసగా సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది అక్కినేని నాగచైతన్యతో వివాహ అనంతరం విపరీతంగా వైరల్ అవుతున్నారు. 

వివాహం అయినప్పటి నుంచి శోభిత ధూళిపాళకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ జంట చాలా కాలం నుంచి ప్రేమించుకున్న అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం జరుపుకున్నారు. వివాహం తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు శోభిత ఎలాంటి సినిమాలలోనూ నటించడం లేదు. నాగచైతన్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. 


ఇక శోభిత తెలుగు, హిందీ లాంటి ఇతర భాష చిత్రాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే నటి శోభితకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నటి శోభిత బాలీవుడ్ నటుడు విజయ్ వర్మఈవెంట్ కి వెళ్లారు. ఆ ఈవెంట్లో భాగంగా వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా విజయ్ వర్మ శోభిత చేతి పట్టుకొని మాట్లాడుతున్నాడు. 


దీంతో ఈ వీడియో కాస్త విపరీతంగా వైరల్ అవుతుంది. అలా అందరి ముందు చేతి పట్టుకొని లాగడం అవసరమా అని కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది వీరిద్దరూ మంచి స్నేహితులు అందుకే వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండడం వల్లనే అలా మాట్లాడుకున్నారని మరి కొంతమంది అంటున్నారు. ఈ కామెంట్ల పైన శోభిత, విజయవర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: