
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా పలు అవార్డులను సైతం గెలుచుకుంది. భారతీయ సినిమాలో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రంగా తెరకెక్కిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీ కృష్ణదేవరాయలుగా అద్భుతంగా నటించి మెప్పించారు..కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అందించిన మ్యూజిక్ చిరస్థాయిగా నిలిచి పోతుంది..
అయితే ఈ సినిమా వచ్చిన 34 ఏండ్ల తర్వాత మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఈ సినిమాకు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.ఈ సినిమాను ఏప్రిల్ 04 న గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది.. అయితే ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో విశ్వంభర దర్శకుడు వశిష్ట స్పెషల్ పోస్ట్ చేసారు..