పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫౌజీ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. డైరెక్టర్ హను రాఘవపూడి వర్కింగ్ స్టైల్ ప్రభాస్‌కి బాగా నచ్చేసిందంట.

షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఫౌజీ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్‌లోనే ఉండగానే.. హనుకి ప్రభాస్ మరో సినిమా ఛాన్స్ ఇచ్చేశాడట. ఇంకేముంది, వెంటనే ప్రొడక్షన్ హౌస్ కూడా ఫిక్స్ చేసేశాడంట డార్లింగ్. ఒక టాప్ ప్రొడ్యూసర్ ద్వారా హనుకి అడ్వాన్స్ కూడా అందేలా చూసుకున్నాడని టాక్. మామూలు విషయం కాదు ఇది.

అయితే ఈ సెకండ్ మూవీ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదండోయ్. ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఫౌజీ, ది రాజా సాబ్ సినిమాలతో పాటు.. స్పిరిట్, ప్రశాంత్ వర్మతో మైథలాజికల్ ఫాంటసీ మూవీ, సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. అంటే హనుతో సెకండ్ మూవీ 2028లో కానీ పట్టాలెక్కే ఛాన్స్ లేదు.

ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఫౌజీ యాక్షన్ మూవీ కాగా.. ఈ సెకండ్ ప్రాజెక్ట్ మాత్రం లవ్ స్టోరీ అంట. యాక్షన్ సీన్స్ ఉండవు కాబట్టి, ప్రభాస్ చేసే భారీ సినిమాలతో పోలిస్తే ఇది చాలా త్వరగా కంప్లీట్ చేయొచ్చు.

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అసలు ఈ సెకండ్ మూవీ ఉంటుందా లేదా అనేది ఫౌజీ రిజల్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఫౌజీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయితే, సెకండ్ మూవీ పక్కాగా ఉంటుంది. ఒకవేళ ఫౌజీ ఆశించినంతగా ఆడకపోతే మాత్రం ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ప్రస్తుతం ప్రభాస్ ఫారిన్‌లో ఉన్నాడు. ఈ నెలాఖరులో తిరిగి రాగానే ది రాజా సాబ్ షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఫౌజీ కంటిన్యూ చేస్తాడు. మొత్తానికి ప్రభాస్ - హను కాంబోలో రాబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడటానికి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇది మాత్రం సూపర్ హిట్ అయితే ఈ దర్శకుడి రేంజ్ గ్లోబల్ రేంజ్ కి చేరుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: